
ఉ ద్యోగ నియామకాల ప్రక్రియను ఏపీ ప్రభుత్వం వేగవంతం చేసింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ లెవెల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఏపీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) రెగ్యులర్‌ ప్రాతిపదికన పలు విభాగాల్లో ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. వీటికి దరఖాస్తుల ప్రక్రియనూ త్వరలోనే ప్రారంభించనున్నారు. నోటిఫికేషన్లకు సంబంధించిన మరిన్ని వివరాలను వెబ్‌సైట్‌ https://slprb.ap.gov.in/UI/index లో పొందవచ్చు. 1. కానిస్టేబుల్‌ పోస్టులు అర్హత: 2026, జులై 1 నాటికి ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. వయసు: 2026, జులై 1 నాటికి కానిస్టేబుళ్లు సివిల్, ఏఆర్‌కు 18 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇతర పోస్టులకు 18 నుంచి 32 ఏళ్లు మించకూడదు. సడలింపులు వర్తిస్తాయి. వేతన శ్రేణి: నెలకు రూ.25,220 - 80,910. ఎంపిక: ప్రిలిమినరీ, దేహదారుఢ్య పరీక్షలు (పీఎంటీ, పీఈటీ), మెయిన్స్‌ పరీక్షలతో. అర్హత: 2026 జులై 1 నాటికి టెన్త్‌/ ఐటీఐ/ ఇంటర్మీడియట్‌ (ఎలక్ట్రానిక్, మెకానిక్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ ఎలక్ట్రానిక్‌ సిస్టమ్‌ మెయింటెనెన్స్‌/ కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌/ మెకానిక్‌ కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌/ ఎలక్ట్రీషియన్‌) ఉండాలి. పోలీస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్‌లో అర్హత: పదో తరగతి/ ఐటీఐ/ ఇంటర్మీడియట్‌ (ఫైర్‌మెన్‌/ మెకానిక్‌ మోటార్‌ వెహికల్‌/ మెకానిక్‌ డీజిల్‌/ ఫిట్టర్‌/ ఆటో ఎలక్ట్రీషియన్‌/ మోటార్‌)తో పాటు డ్రైవర్‌ పోస్టులకు లైట్‌ మోటార్‌ వెహికల్‌(ఎల్‌ఎంవీ) డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి. వేతన శ్రేణి: నెలకు రూ.25,220-80,910. ఎంపిక: ధ్రువపత్రాల పరిశీలన, దేహదారుఢ్య పరీక్షలు, ట్రేడ్‌ టెస్టు/ డ్రైవింగ్‌ టెస్టు, రాత పరీక్షలతో. 2. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు వేతన శ్రేణి: రూ.44,570- 1,27,480. ఎంపిక: ప్రిలిమినరీ, దేహదారుఢ్య, మెయిన్స్‌ రాత పరీక్షలతో. అర్హత: కమ్యూనికేషన్‌ (పోస్ట్‌ కోడ్‌ 15): ఈఈఈ/ కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌/ ఐటీ/ బీఎస్సీ ఎలక్ట్రానిక్స్‌లో డిప్లొమా లేదా బీటెక్‌/ డిగ్రీ.





