

- 2050 పోలీసు ఉద్యోగాల భర్తీ
- ఎస్సై కానిస్టేబుల్ పోస్టుల నోటిఫికేషన్
- త్వరలో రాత పరీక్ష తేదీలు
AP Police Recruitment: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉద్యోగాల జాతర ముంచెత్తుతోంది. నిరుద్యోగ యువతకు ప్రభుత్వం వరుసగా బిగ్ రిలీఫ్ ఇస్తోంది. మంగళవారం ఏపీపీఎస్సీ ద్వారా 892 గ్రూప్-1 తదితర పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సర్కార్, తాజాగా పోలీసు శాఖలో భారీ భర్తీకి తెరతీసింది. రాష్ట్రంలోని నిరుద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (APSLPRB) ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది. ఖాళీల భర్తీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా పూర్తి చేసేందుకు బోర్డు సమాయత్తమవుతోంది.
2,050 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ:
తాజా నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2,050 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో సబ్ ఇన్స్పెక్టర్ (AP Police Recruitment)(SI) విభాగంలో సివిల్ 253, ఏఆర్ 116, ఎస్పీఎఫ్ 9, కమ్యూనికేషన్ 50, పిటిఓ 10 పోస్టులు ఉన్నాయి. అలాగే కానిస్టేబుల్ విభాగంలో సివిల్ 542, ఏఆర్ 285, ఫైర్మెన్ 158, పురుష జైలు వార్డర్లు 150, మహిళా జైలు వార్డర్లు 21, కమ్యూనికేషన్ 200, పిటిఓ మెకానిక్స్ 15, డ్రైవర్ 198, సైంటిఫిక్ అసిస్టెంట్ 43 పోస్టులు ఉన్నాయి.
త్వరలోనే రాత పరీక్ష తేదీలు:
ఈ నోటిఫికేషన్తో సుదీర్ఘకాలంగా పోలీసు ఉద్యోగం సాధించాలని నిరంతరం శ్రమిస్తున్న అభ్యర్థుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. దరఖాస్తు ప్రక్రియ, వయోపరిమితి సడలింపులు, రాత పరీక్షల షెడ్యూల్ వివరాలను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు త్వరలోనే అధికారిక వెబ్సైట్లో సమగ్రంగా అందుబాటులో ఉంచనుంది. ఖాళీల సంఖ్య పెరగడంతో పోటీ కూడా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.