
అదనపు కలెక్టర్‌ కిరణ్మయితో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కందుకూరు, న్యూస్‌టుడే: ప్రధాని మోదీ 25 ఏళ్లుగా సీఎంగా, ప్రధానిగా అందించిన సేవలను ప్రజలకు వివరించేందుకు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 17న దేశవ్యాప్తంగా చేపడుతున్న ‘సేవా అభియాన్‌’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం తన స్వగ్రామమైన రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్‌లో ఆ కార్యక్రమంపై అధికారులతో సమావేశం నిర్వహించారు. గ్రామంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి తనతో పాటు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ హాజరవుతారని తెలిపారు. వీబీజీరామ్‌జీ, పీఎం కిసాన్‌ తదితర కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నేరుగా మాట్లాడుతారని పేర్కొన్నారు. 25 ఏళ్ల పరిపాలన, ప్రధాని జన్మదినాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలు తమ ఇళ్లలో దీపాలు వెలిగించి శుభాకాంక్షలు తెలుపాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





