
ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడి 150 ఏళ్లు అవుతున్న వేళ నిర్వహణ ఇస్లాంపేటలో వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రకాశం జిల్లా ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడి ఈ నెల 30వ తేదీకి 150 సంవత్సరాలు పూర్తికానుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఒంగోలు నగరంతోపాటు కొత్తపట్నం మండలంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం 150 ఉచిత మెగా వైద్య శిబిరాలు నిర్వహించారు. 119 ప్రైవేటు వైద్యశాలల సహకారంతో 680 మంది సిబ్బంది వైద్య సేవలు అందించేందుకు ముందుకొచ్చారు. శిబిరాల్లో మొత్తం 22,139 మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఒంగోలులోని ఇస్లాంపేట, బాపూజీ దుకాణ సముదాయం, గద్దలగుంట ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన శిబిరాలను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ ప్రారంభించారు. మిగతా ప్రాంతాల్లో జరుగుతున్న శిబిరాలను పరిశీలించి, వైద్యులకు పలు సూచనలు చేశారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




