
సీఎం రేవంత్ రెడ్డి మాటల్లో కనిపించేంత గట్టితనం ఆయన చేతల్లో లేదని మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అదే స్థాయిలో కఠినంగా వ్యవహరించి ఉంటే తెలంగాణలో ఎంతోమంది జైలుకు వెళ్లేవారని పేర్కొన్నారు. అయితే రేవంత్ రెడ్డి ఓపికగా ఎదురుచూసి ముందుకు సాగే స్వభావం కలిగిన వ్యక్తి అని వెల్లడించారు. ఆర్యవైశ్యులకు రాజకీయ పదవులు ఇవ్వాలని కోరిన టీజీ వెంకటేశ్.. రూ.కోటి విరాళం ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆర్యవైశ్యులకు తగిన గుర్తింపు, రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.






