
– నల్లగొండ16వ డివిజన్ కార్పోరేటర్ పెరిక స్వాతి నీలగిరి, సెప్టెంబర్ 16 : పుట్టిన ప్రతి బిడ్డను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఇచ్చేందుకు పోషకాహారం చాలా అవసరమని సరిపడా పోషకాహారం అందించాలని నల్లగొండ 16వ డివిజన్ కార్పొరేటర్ పెరిక స్వాతి అన్నారు. నల్లగొండ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని చర్లపలి సెక్టార్లో పోషణమాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ.. బాల్య దశలోనే బిడ్డకు సరైన ఆహారం, విద్య, అభివృద్ధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను తీసుకు వస్తుందన్నారు. మూడు నుండి ఆరు సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ మంచి పౌష్టికాహారం అందించడంతో పాటు చదువుపై కూడా ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. చిన్నారులకు శారీరక, మానసిక, సామాజిక అభివృద్ధికి ప్రీస్కూల్ కార్యక్రమాలు సక్రమంగా నిర్వహిస్తు వెనకబడిన పిల్లలపై ప్రత్యేకంగా శ్రద్ధ చూపించాలన్నారు. ప్రతి బిడ్డ సమగ్రంగా ఎదగాలంటే టీచర్లుగా మీవంతు కృషి అవసరమని వివరించారు. 0-6 సంవత్స రాలలోపు పిల్లల్లో జరిగే అభివృద్ధి క్షేత్రాల గురించి ప్రేరణ, ఈసీసీఈ, పోషణ, వయసుకు తగ్గిన బరువు, ఎత్తులపై సూపర్వైజర్ మర్రి జయమ్మ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు సైదమ్మ, రేణుక, పుష్పలత, పుష్పకళ, మమత తల్లులు బాలింతలు పాల్గొన్నారు.




