
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్ఎస్ ఎలాంటి పొత్తు పెట్టుకోదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. హర్యానాలోని ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో విద్యార్థులతో ముఖాముఖిలో ఈ విషయాన్ని వెల్లడించారు. లోక్‌సభ స్థానాలను దేశవ్యాప్తంగా దామాషా ప్రకారం పెంచితే డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వడానికి తమకేమీ అభ్యంతరం లేదని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి, స్టార్టప్ ఎకోసిస్టమ్, ఏఐ, హైదరాబాద్‌పై పెరుగుతున్న ఒత్తిడి, దీర్ఘకాలిక పట్టణ ప్రణాళిక వంటి అంశాలపైనా కేటీఆర్ మాట్లాడారు.