
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్, తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా ప్రేమలో ఉన్నారన్న వార్తలకు మరోసారి బలం చేకూరింది. వినాయక చవితి పండగను పురస్కరించుకుని వీరు జంటగా పూజలు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను స్వయంగా తరుణ్ భాస్కరే తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. అయితే ఈ పోస్టుకు తరుణ్ ఎలాంటి క్యాప్షన్ రాయలేదు. ఈషా కూడా ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. కానీ, తమ రిలేషన్ షిప్ గురించి ఇలా హింట్ ఇస్తున్నారని నెటిజన్లు భావిస్తున్నారు. దీనికి తోడు మంచు లక్ష్మి, ప్రగతి, శివాత్మిక, షాలిని కొండెపూడి లాంటి స్టార్ సెలబ్రిటీలు కూడా వీరికి ఆల్ ది బెస్ట్, కంగ్రాట్స్ అని విషెస్ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. గత కొద్ది కాలంగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ త్వరలోనే వీళ్లు పెళ్లి చేసుకోనున్నారని నెటిజన్లు కూడా ఈషా- తరుణ్ లకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్లు.





