
అనకాపల్లిలో సస్య గణపతి విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. పర్యావరణ పరిరక్షణకు వినూత్న సందేశాన్ని అందించేలా మొక్కలతో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు నిర్వాహకులు. అంతేకాదు ఆ మండపం, పరిసర ప్రాంతాలు కూడా మొక్కలతో అలంకరించారు. చింతామణి గణపతి దత్తక్షేత్రం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సస్య గణపతిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు.





