
పిఠాపురం: వినాయక చవితి పండగ వేళ.. కాకినాడ జిల్లా పిఠాపురంలో విషాదం చోటుచేసుకుంది. గణపతి విగ్రహం ఏర్పాటు పనుల్లో భాగంగా కోనేరులోకి దిగిన యువకుడు జారిపడి మృతి చెందాడు. కందరాడ గ్రామానికి చెందిన ధనకొండ సాయి(22) ఆదివారం రాత్రి గణపతి విగ్రహం ఏర్పాట్లలో పాల్గొన్నాడు. విగ్రహం ప్రతిష్టించడానికి ముందు పవిత్ర జలాల కోసం సోమవారం తెల్లవారుజామున స్నేహితులతో కలిసి పాదగయకు వెళ్లాడు. అక్కడి కోనేరులోని నీళ్లు తీసుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు జారిపడి గల్లంతయ్యాడు. స్థానికంగా ఉన్న రెస్క్యూ టీమ్‌ సాయి మృతదేహాన్ని వెలికితీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.