
జిల్లాలో సముద్ర తీరం భారీగా కోత న్యూస్‌టుడే, అల్లవరం అల్లవరం మండలం ఓడలరేవు సముద్ర తీరంలో రాత్రి సమయంలో ఇసుక తరలిస్తున్న లారీలు సముద్ర తీరం అనగానే ఆహ్లాదకరమైన వాతావరణం.. పచ్చని సరుగుడు తోటలు.. సముద్రపు అలలతో ఉంటుంది. జిల్లాలో మాత్రం తీరం సందర్శకులను ఆందోళనకు గురి చేస్తోంది. కొంత కాలంగా తీరం ప్రాంతాలు సముద్రంలో కలిసిపోతున్నాయి. కొంత వరకు సముద్రంలో మార్పులు కారణం కాగా.. మానవ తప్పిదాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. జిల్లాలో 93 కి.మీ. మేర సముద్ర తీరం ఉంది. దీని పరిధిలో 7 మండలాలు, సుమారు 40 గ్రామాలు ఉన్నాయి. జాతీయ తీర పరిశోధన సంస్థ నిర్వహించిన అధ్యయనంలో జిల్లాలో 47 శాతానికి పైగా తీరం కోత ప్రభావానికి గురవుతోందని తేలింది. ప్రధానంగా అల్లవరం, ఉప్పలగుప్తం, మలికిపురం, సఖినేటిపల్లి, భైరవపాలెం మండలాల పరిధిలో ఈ ముప్పు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. నివాసాల వైపు ఉరకలేస్తుండటంతో తీర గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు, అధికారులు మారుతున్నా.. ఇసుక అక్రమార్కులు మాత్రం ఆగడం లేదు. కొన్ని నెలలుగా ఓడలరేవు, కొమరగరిపట్నం, ఎస్‌.యానం, అంతర్వేది, తూర్పుపాలెం గ్రామాల పరిధిలోని తీరం నుంచి నిత్యం వేల టన్నుల ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా అధికారులు వాటివైపునకు కన్నెత్తి చూడటం లేదు. గనులశాఖకు చెందిన ఉన్నతాధికారి కనుసన్నల్లోనే ఈదందా సాగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అప్పుడప్పుడూ తూతూమంత్రంగా దాడులు చేసి చేతులు దుపుపేసుకుంటున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




