
యూపీఐ లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం ఫీజు వసూలు చేయాలని తీసుకున్న నిర్ణయం పట్ల ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అమెరికా ఒత్తిళ్లకు మరోసారి ప్రధాని మోదీ తలొగ్గారని ఆయన ఆరోపించారు. మోదీ తీరుతో సామాన్య ప్రజానీకం జేబులకు మరోసారి చిల్లులు పడబోతున్నాయని రాహుల్ దుయ్యబట్టారు. ఎలాంటి ఫీజు ఉండదని ఇప్పుడు రూ.2 వేలు దాటిన యూపీఐ లావాదేవీలు, రూపే డెబిట్ కార్డు చెల్లింపుపై ఫీజు వసూలు చేయనున్నారని పేర్కొన్నారు.




