
మల్లాపూర్, సెప్టెంబర్ 16: అటవీ ప్రాంతంలో అక్రమంగా టేకు కలప చెట్లను నరికివేతకు సంబధించిన అంశంలో జగిత్యాల జిల్లాలోని ఓబులాపూర్, ఓబులాపూర్ ఎస్టీ తండ గ్రామాలకు చెందిన గ్రామస్తులు రత్నాపూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ నల్ల రాజన్నపై పోలీస్టేషన్లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో మండలంలో ఓ పత్రికకు సంబధించిన విలేకరికి ఫోన్ చేసి సదరు నేత ఇష్టానుసారంగా దుర్భాషలాడ మాట్లాడి అవమానించారు. ఈ విషయంమై జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో బుధవారం పోలీస్టేషన్లో ఎస్ఐ అనిల్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ అండదండలతో జర్నలిస్టులపై అనుచితంగా వ్యాఖ్యలు చేయడం సరికాదని, దీనిపై శాఖ పరమైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక్కడ మండల జర్నలిస్టులు, తదితరులు పాల్గొన్నారు.





