
Boltt Ace 5G.. తక్కువ ధరలో 5G ఫోన్ కొనాలని చూస్తున్నవారికి Boltt బ్రాండ్ గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా విడుదలైన Boltt Ace 5G, Bolt Evo స్మార్ట్ఫోన్లు తొలి సేల్లోనే పూర్తిగా అమ్ముడయ్యాయి. దీంతో మరోసారి విక్రయానికి తేదీని ప్రకటించింది. సెప్టెంబర్ 15న మధ్యాహ్నం 12 గంటలకు Flipkartలో ఈ రెండు ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి.
బడ్జెట్ ధరలో పెద్ద స్క్రీన్, భారీ బ్యాటరీ, 5G కనెక్టివిటీ కావాలనుకునేవారికి Boltt కొత్త ఫోన్లు ఆసక్తికరంగా మారాయి. తొలి సేల్లో మంచి స్పందన అందుకున్న Ace 5G, Evo మోడళ్లను మరోసారి విక్రయించేందుకు కంపెనీ సిద్ధమైంది. రూ.9,999 ప్రారంభ ధరతో లభించే Boltt Evoపై ఇప్పుడు కొనుగోలుదారుల దృష్టి పడింది.





