
పాటలు పాడటం ఇష్టమే కానీ గొంతు, ట్యూన్ విషయంలో కాస్త భయపడేవారికి boAt కొత్త గ్యాడ్జెట్ ఆసక్తికరంగా మారనుంది. సాధారణ పార్టీ స్పీకర్లకు భిన్నంగా ఇందులో పాడే సమయంలో వాయిస్‌ను మెరుగ్గా వినిపించే Auto-Tuner టెక్నాలజీ ఉంది. LED లైట్స్, వైర్లెస్ మైక్, భారీ బేస్ వంటి ఫీచర్లు పార్టీ మూడ్‌ను మరింత పెంచుతాయి.




