
ఆదోని మార్కెట్: ఆదోని పురపాలక సంఘం కార్యాలయంలో పట్టణ పోలింగ్ కేంద్రాల తుది జాబితాను పురపాలక కమిషనర్ నయూమ్ అహ్మద్ పట్టణ ప్రణాళిక అధికారులతో కలిసి విడుదల చేశారు. జనాభా ప్రాతిపదికన వార్డుల పునర్విభజన ప్రకారం 179 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 52 వార్డులకు గాను 1.76 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి..వారి ద్వారా స్వీకరించిన సూచనలు, అభ్యంతరాలు తీసుకొని కేంద్రాల తుది జాబితాను రూపొందించి విడుదల చేశామన్నారు.
మట్టి గణేశ్ ప్రతిమల పంపిణీ
ఆదోని మార్కెట్: ఆదోని పట్టణంలో భావసార క్షత్రియ సమాజ్‌ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. వినాయక చవితి సందర్భంగా విక్టోరియా పేట పాండురంగ స్వామి ఆలయంలో 500 విగ్రహాలను పంపిణీ చేసినట్లు ఆ సంఘం అధ్యక్షుడు హనుమంతరావు తెలిపారు. ప్రతి ఒక్కరూ మట్టి గణేశుడిని పూజించి పర్యావరణాన్ని కాపాడాలన్నారు. ప్రతి ఏటా భక్తుల సౌకర్యార్థం పంపిణీ చేస్తున్నట్లు వారు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





