

- నడిరోడ్డుపై యువకుడికి చిత్రహింసలు
- మెకానిక్ సహా ఐదుగురి అరెస్ట్
- ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు
Bhogapuram Incident: విజయనగరం జిల్లా భోగాపురం(Bhogapuram Incident)లో మానవత్వాన్ని తలదన్నే అత్యంత దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. బైక్ రిపేర్ చేసినందుకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో ఓ యువకుడిపై మెకానిక్ మహేశ్ విపరీతమైన దౌర్జన్యానికి పాల్పడ్డాడు. బాధితుడి మెడకు, చేతులకు తాళ్లు కట్టి, నడిరోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లడమే కాకుండా.. ఆ తర్వాత బైక్కు కట్టి దారుణంగా ఈడ్చుకెళ్లాడు. రామచంద్రరాజుపేటకు చెందిన ఈ యువకుడి పట్ల స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమైంది.
- మెకానిక్ సహా ఐదుగురి అరెస్ట్





