
చినగంజాం: చినగంజాం మండలంలో వినాయక చవితి పండుగ సందర్భంగా 12 గ్రామ పంచాయతీల్లోనూ సందడి మొదలైంది. ఆదివారం నెలపొడుపు కావడంతో పందిళ్ల నిర్వహకులు వినాయక విగ్రహాలను చీరాల, వేటపాలెం, ఒంగోలు తదితర ప్రాంతాల్లోని తయారీ కేంద్రాల నుంచి వాహనాల్లో పందిళ్ల వద్దకు చేర్చారు. సోమవారం వినాయక చవితి పండుగ పర్వదినాన విగ్రహాలకు పూజలు చేసి పందిళ్లల్లో ఉంచనున్నారు. ఆదివారం సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో చినగంజాం మండలానికి ప్రధానమైన ప్రాంతమైన సోపిరాల భైరాగితోట (రచ్చబండ) పందిరి వద్ద భారీగా విద్యుత్తు కాంతులతో డెకరేషన్ చేశారు. గ్రామానికి ప్రవేశ ద్వారమైన ఆర్చి వద్ద శ్రీవేంకటేశ్వరస్వామి వారి భారీ విద్యుత్తు కటౌటును ఏర్పాటు చేశారు. దీంతో స్థానికులు ఆసక్తిగా గమనించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





