
ఎస్సై, కానిస్టేబుల్‌ స్థాయి ఉద్యోగాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ పూర్తి వివరాలతో త్వరలో షెడ్యూల్‌ ఈనాడు, అమరావతి: పోలీసు ఉద్యోగార్థులకు తీపికబురు. రాష్ట్రంలో పోలీసు, అగ్నిమాపక, జైళ్లు, ఎస్‌పీఎఫ్, పోలీసు ట్రాన్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్, పోలీసు కమ్యూనికేషన్స్, ఫోరెన్సిక్‌ విభాగాల్లో మొత్తం 2,050 పోస్టుల భర్తీకి పోలీసు నియామక మండలి బుధవారం నోటిఫికేషన్లు విడుదల చేసింది. వీటిల్లో ఎస్సై, కానిస్టేబుల్‌ స్థాయి ఉద్యోగాలతో పాటు ఫోరెన్సిక్‌ నిపుణుల పోస్టులూ ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు https://slprb.ap.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పోలీసు నియామక మండలి ఛైర్మన్‌ రాజీవ్‌కుమార్‌ మీనా తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ, ప్రాథమిక రాతపరీక్ష తేదీలు, ఇతర వివరాలతో సమగ్ర షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారమే రాష్ట్రప్రభుత్వం ఈ నోటిఫికేషన్లు జారీచేసింది. కానిస్టేబుల్, ఎస్సై అభ్యర్థులకు రెండేళ్ల పాటు వయోపరిమితి పెంచింది. రాష్ట్రంలో చివరిసారిగా 2022 నవంబరులో పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. వైకాపా ప్రభుత్వం ప్రాథమిక రాతపరీక్ష నిర్వహించి నియామకం పూర్తిచేయకుండా వదిలేసింది. ఒక్క కానిస్టేబుల్‌ పోస్టూ భర్తీచేయలేదు. 2024లో కూటమి అధికారంలోకి రాగానే శారీరక కొలతలు (పీఎంటీ), దేహదారుఢ్య (పీఈటీ) పరీక్షలు, తుది రాతపరీక్షలు నిర్వహించి ఎంపిక ప్రక్రియ పూర్తిచేసింది. ఎంపికైన అభ్యర్థులందరికీ గతేడాది చివర్లో శిక్షణకు పంపించింది. తాజాగా వీరి శిక్షణ ముగిసింది. త్వరలో పాసింగ్‌ అవుట్‌ పెరేడ్‌ పూర్తిచేసుకుని విధుల్లో చేరనున్నారు. ఇప్పుడు మరోసారి పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చాక రెండోసారి పోలీసు నియామక ప్రక్రియ చేపడుతోంది. అగ్నిమాపక శాఖలో ఫైర్‌మెన్, జైళ్లశాఖలో వార్డర్‌ పోస్టుల భర్తీకి 2018లో తెదేపా అధికారంలో ఉన్నప్పుడే నోటిఫికేషన్‌ వచ్చింది. మళ్లీ ఎనిమిదేళ్ల తర్వాత తెదేపా నేతృత్వంలోని ప్రభుత్వమే ఆయా శాఖల్లోని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీచేసింది. కానిస్టేబుల్‌ స్థాయి ఉద్యోగాలకు.. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





