
అమరావతి: ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. మొత్తం 163 పోస్టుల భర్తీకి గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను ఏపీపీఎస్సీ ( APPSC ) విడుదల చేసింది. అక్టోబర్‌ 6 నుంచి 27 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. భర్తీ చేయనున్న వాటిలో డిప్యూటీ కలెక్టర్లు 11, ట్యాక్స్‌ సర్వీసెస్‌ అసిస్టెంట్‌ కమిషనర్లు 14, డీఎస్పీ సివిల్‌ 36, డీఎస్పీ కమ్యూనికేషన్స్‌ 3, డీఈవోలు 14, ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్లు 1, ఆర్టీవోలు 3, డిప్యూటీ రిజిస్టర్‌ కోఆపరేటివ్‌ సర్వీసెస్‌ 15, మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌-2 పోస్టులు 12, అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌ 2, డిస్ట్రిక్ట్‌ ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌ 3, అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌ 14, డివిజినల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ 35 పోస్టులు ఉన్నాయి. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





