
Ap Heavy Rains: ఆంధ్రప్రదేశ్ ప్రజలను వర్షాలు వీడటం లేదు. ఇటీవలే తీవ్ర వాయుగుండం కళింగపట్నం వద్ద తీరం దాటి ఉత్తరాంధ్ర జిల్లాలను ముంచెత్తిన సంగతి మరవకముందే, బంగాళాఖాతంలో మరొక వాయుగుండం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం మయన్మార్ – అండమాన్ పరిసర ప్రాంతాల మధ్య కేంద్రీకృతమైన ఈ వాయుగుండం, రాగల 12 గంటల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. అండమాన్‌లోని మాయాబందర్‌కు తూర్పు ఈశాన్యంగా 580 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉత్తర వాయవ్య దిశగా బ బంగాళాఖాతంలో మరొక వాయుగుండం(Ap Heavy Rains) ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.





