
సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చనీయాంశమైన ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి మరియు మాధురి రాథోడ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మాధురి రాథోడ్ తనపై మోసం జరిగిందన సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చనీయాంశమైన ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి మరియు మాధురి రాథోడ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మాధురి రాథోడ్ తనపై మోసం జరిగిందని ఆరోపిస్తూ నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది. ఈ కేసులో ఈశ్వర్ సాయికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈశ్వర్ సాయికి సంబంధించిన న్యాయవాది కోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం, ఇద్దరి మధ్య సంబంధం చాలా కాలంగా పరస్పర సమ్మతితో కొనసాగిందని, ఇరువురికి పరిచయం చాలా కాలంగా ఉందని తెలిపారు. అయితే, ఈ వ్యవహారంలో అసలు ఏమి జరిగిందో, వైరల్ వీడియోల ద్వారా ఈ కేసు ఎలా హైకోర్టుకు చేరిందో అనేది ఆసక్తికరంగా మారింది. వేములవాడలోని ఓ హోటల్ గదిలో ఈశ్వర్ సాయి మరియు మాధురి రాథోడ్ ఒకే గదిలో ఉన్న సమయంలో, ఈశ్వర్ సాయి భార్య శరణ్య అక్కడికి చేరుకుని వారిద్దరిని పట్టుకున్నట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ వీడియోలు చూసిన తర్వాత, శరణ్య మాధురిని ప్రశ్నించడంతో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, వ్యక్తిగతంగా ఉన్న వ్యవహారం బహిరంగ చర్చగా మారింది. ఆ తర్వాత మాధురి రాథోడ్ శరణ్యపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె తనపై దాడి జరిగిందని, దూషించారని ఆరోపించింది. వేములవాడ ఘటన తర్వాత వివాదం మరింత ముదిరింది. మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ నార్సింగి పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా బీఎన్ఎస్ 69, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని సెక్షన్ 3(2)(వీ) కింద కేసు నమోదైంది. కేసు నమోదైన తర్వాత, తనకు న్యాయం జరగడం లేదంటూ మాధురి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన కూడా కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు, మాధురి ఫిర్యాదుతో నమోదైన కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఈశ్వర్ సాయి హైకోర్టును ఆశ్రయించాడు. మాధురి రాథోడ్‌తో తనకు ఉన్న సంబంధం దీర్ఘకాలంగా పరస్పర సమ్మతితో కొనసాగిందని అతని తరఫు న్యాయవాది నాగూర్ బాబు కోర్టుకు తెలిపారు. పెళ్లి పేరుతో మోసం చేశారన్నవి కేవలం ఆరోపణలేనని, కేవలం సానుభూతి పొందేందుకు తప్పుడు ఆరోపణలు, కేసు పెట్టారని కూడా వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు ఈశ్వర్ సాయికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.






