
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఓ విద్యార్థి కందిపప్పు గింజపై సూక్ష్మ వినాయకుడి చిత్రాన్ని గీసి అబ్బురపరిచాడు. ఆదోని పట్టణంలోని అరుణ్ జ్యోతి నగర్‌కు చెందిన సుజాత, రాజు దంపతుల కుమారుడు పి. హరీష్ కుమార్ సూక్ష్మ కళలలో భాగంగా కందిపప్పుపై అతి చిన్న వినాయకుడి రూపాన్ని తీర్చిదిద్దాడు. హరీష్ కుమార్ ప్రస్తుతం నెహ్రూ మెమోరియల్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. అతి చిన్న కందిపప్పుపై వినాయకుడి చిత్రాన్ని వేసిన విద్యార్థి ప్రతిభను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఫయాజుద్దీన్, ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు.





