
ఆదిలాబాద్ సాంస్కృతికం: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని కుమురం భీం విగ్రహానికి సీపీఐ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కుమురం భీం జల్-జంగల్-జమీన్ నినాదంతో నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారని, ఆయన త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ గిరిజన సమాఖ్య జిల్లా అధ్యక్షుడు కొడప సురేష్, నాయకులు షేక్ పాషా, ఎస్.అరుణ్ కుమార్, మహబూబ్ ఖాన్, తబ్రేస్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





