
Ap Govt To Distribute 1.25 Lakhs House Pattas: ఏపీ ప్రభుత్వం పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడానికి సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన పేదవారికి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. మొత్తం 1,24,873 మందికి పట్టాలు ఇవ్వనుంది. ఈ మేరకు మొత్తం 4800 ఎకరాలు సేకరించాలని భావిస్తున్నారు. మొత్తం రూ.1800 కోట్లతో భూ సేకరణ చేయనున్నారు. ఈ మేరకు అక్టోబర్ నవంబర్ నెలలో ఇళ్ల స్థలాల కోసం భూ సేకరణ చేయాలని భావిస్తున్నారు.





