
ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఈనాడు, అమరావతి: బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు విజయవంతంగా ముగియడం దేశానికి గర్వకారణమని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ఈ ఘనత సాధ్యమైందని ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. బ్రిక్స్‌ దేశాల మధ్య బలమైన భాగస్వామ్యం రూపొందాలని ఆకాంక్షించారు. ఏకపక్ష యుద్ధాల్ని ఖండిస్తూ బ్రిక్స్‌ ఉమ్మడి డిక్లరేషన్‌ చేయడం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. పవన్‌కల్యాణ్‌ పూర్తిస్థాయిలో కోలుకోవాలి - కేరళం ముఖ్యమంత్రి వీడీ సతీశన్‌ ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ పూర్తిస్థాయిలో కోలుకుని నిరంతరం ఆరోగ్యంగా ఉండాలని కేరళం ముఖ్యమంత్రి వీడీ సతీశన్‌ ఆకాంక్షించారు. తన కేరళం పర్యటన, ఆయుర్వేద చికిత్స ముగియడంతో అక్కడి ప్రజలు, ప్రభుత్వం చూపిన ఆత్మీయతకు కృతజ్ఞతలు తెలియజేస్తూ పవన్‌కల్యాణ్‌ చేసిన పోస్టుపై సతీశన్‌ ఎక్స్‌లో స్పందించారు. ‘‘ఆయుర్వేద చికిత్స, విశ్రాంతి కోసం మీరు కేరళంను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. మా ప్రజల ఆప్యాయత, పురాతన దేవాలయాల దర్శనం మీకు ఉపశమనాన్ని ఇచ్చినట్లు తెలిపినందుకు సంతోషంగా ఉంది. మీకు మళ్లీ ఆతిథ్యమివ్వడానికి ఎదురుచూస్తున్నాం. మా ప్రజలు, ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు’’ అని సతీశన్‌ పేర్కొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





