
మాట్లాడుతున్న రఘునాథరెడ్డి. చిత్రంలో సాయిశ్రీనివాస్, సుధీర్‌బాబు, వెంగళరెడ్డి తదితరులు విజయవాడ(గాంధీనగర్‌), న్యూస్‌టుడే: హెల్త్‌కార్డుల పేరుతో భరోసా ఇచ్చి, వైద్యం విషయంలో చేతులు ఎత్తేయడం సరికాదని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.రఘునాథరెడ్డి, లంకపల్లి సాయిశ్రీనివాస్‌ అన్నారు. ఆదివారం విజయవాడలోని ఎస్టీయూ కార్యాలయంలో నిర్వహించిన తృతీయ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులకు హెల్త్‌కార్డుల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందిస్తామని ప్రభుత్వం భరోసా ఇచ్చినప్పటికీ.. ఆచరణలో పరిస్థితి భిన్నంగా ఉందని వాపోయారు. ఆస్పత్రుల్లో హెల్త్‌కార్డులు చూపించినప్పటికీ నగదు రహిత వైద్యం అందడం లేదని చెప్పారు. ఉద్యోగుల నుంచి ప్రీమియం వసూలు చేస్తూ.. అవసరమైన సమయంలో వైద్యం అందకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఉపాధ్యాయులపై బోధనేతర కార్యక్రమాల భారాన్ని తగ్గించాలని ఎస్టీయూ నాయకుడు జోసఫ్‌ సుధీర్‌బాబు కోరారు. మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఏకీకృత రూల్స్‌కు పరిష్కారం చూపాలని, కేజీబీవీ ఉపాధ్యాయులకు కనీస వేతనాల స్కేలు అమలు చేయాలన్నారు. నాయకులు బి.వెంగళరెడ్డి, అరుణ కిషోర్, ఇలియాస్‌ బాషా, గంగాధర్‌బాబు, పెదబాబు, గోకారి తదితరులు పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





