
విడపనకల్లు: అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం కరకముక్కల గ్రామానికి చెందిన రైతు నాగేంద్ర.. పొలం పనులకు వెళ్లి ఎద్దుల బండితో గుంతకల్ బ్రాంచ్ కెనాల్ (జీబీసీ) కాలువపై నుంచి వెళ్తుండగా.. ఎద్దులు ఒక్కసారిగా బెదిరాయి. దీంతో ఎద్దుల బండి కాలువలోకి దూసుకెళ్లింది. రైతు నాగేంద్రతో పాటు ఎద్దుల బండి, ఎద్దులు కాలువ నీటిలో కొట్టుకుపోయాయి. గమనించిన పొలికి గ్రామ రైతులు కాలువలోకి దూకి నాగేంద్ర, ఎద్దులు, ఎద్దుల బండిని సురక్షితంగా బయటకు తెచ్చారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





