
తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉండదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం హర్యానా సోనిపట్ లోని ఓపీ జిందాల్ గ్లోబల్ వర్సిటీలో “ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్: ది స్టోరీ ఆఫ్ ఎ స్టార్టప్ స్టేట్” అనే అంశంపై ప్రత్యేక ఉపన్యాసం ఇచ్చారు.





