
ఇచ్చోడ : తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ.. మండల కేంద్రంలోని భాజపా ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆ పార్టీ కార్యాలయం వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ విమోచన చరిత్రను, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన జాతీయవాదుల, అమరవీరుల త్యాగాలను, ఆపరేషన్ పోలో ఘట్టాలను పాఠశాల విద్యార్థుల పాఠ్యాంశాల్లో అధికారికంగా చేర్చాలన్నారు. పోలీసు చర్య తర్వాత నిజాం పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిందన్నారు. అప్పటి పాలకుల దౌర్జన్యాలతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. భాజపా నాయకులు రమేష్, కొల్లూరి శేఖర్, కదం బాపురావు, భీమ్ రెడ్డి, పేందూరు తులసిరామ్, శ్రీనివాస్, మల్లేష్, పాండురంగ తదితరులు పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





