
మందమర్రి పట్టణం: ఎల్‌నినో ప్రభావం రాష్ట్ర ప్రజలు, రైతులపై ఉండొద్దని పూజలు నిర్వహించినట్టు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మార్కెట్లో మంత్రి వివేక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ గణపతి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావం చాలా దేశాల్లో ఉందన్నారు. మన రాష్ట్రంలో మాత్రం దాని ప్రభావం ఉండకుండా దేవుడు కరుణిస్తాడని ఆకాంక్షించారు. ఈ నెలలో మరోసారి వర్షం కురిసి ప్రాజెక్టులు నిండాలని గణపతిని వేడుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా మంత్రిని కాంగ్రెస్ నాయకులు, మార్కెట్ వ్యాపారస్థులు ఘనంగా సన్మానించారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




