
సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ వారణాసి. ఈ సినిమా పై అంచనాలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. దాంతో అభిమానులు ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందా అని ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. సినిమాలో కీలకమైన నెగిటివ్ రోల్లో కనిపించనున్న మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆయన మాట్లాడుతూ.. ‘వారణాసి’ కేవలం ఒక సాధారణ టైమ్ ట్రావెల్ కథ కాదని పృథ్వీరాజ్ చెప్పడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచేసింది. “ఇది కేవలం టైమ్ ట్రావెల్ స్టోరీ కాదు. అంతకుమించిన స్థాయిలో కథ ఉంటుంది. డిఫరెంట్ టైమ్ ట్రావెల్స్ మధ్య ఈ కథ సాగుతుంది” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.





