
గత వారం షేక్ హసీనా చేసిన ప్రసంగం ఒక ముఖ్యమైన రాజకీయ ప్రకటన మాత్రమే కాదు, ఆమెకు ఉన్న మద్దతు స్థాయి ఎంత? అది ఎంత విస్తరించి ఉందో అంచనా వేసే ప్రయత్నం కూడా. ఈ కార్యక్రమాన్ని న్యూఢిల్లీలోని ఫారిన్ కరెస్పాండెంట్స్ క్లబ్, సౌత్ ఏషియా వర్చువల్‌గా నిర్వహించింది. తాను బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తానని, దాని వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురైనా, ప్రాణాలకు ముప్పు వచ్చినా సిద్ధంగా ఉన్నానని హసీనా ప్రకటించారు. తన తండ్రి బంగబంధు షేక్ ముజిబుర్ రెహ్మాన్ వారసత్వం, స్వాతంత్య్ర పోరాటం, 1971 విమోచన యుద్ధాన్ని ప్రస్తావిస్తూ, 1981, 1983, 1985 సంవత్సరాల్లో తన ప్రవాస జీవితం, అరెస్టు, 2004 హత్యాయత్నాన్ని గుర్తుచేశారు. అయితే 2007లో అప్పటి సైన్య మద్దతు ఉన్న కేర్‌టేకర్ ప్రభుత్వం తన ప్రవేశాన్ని అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నం, ఢాకాలో లభించిన భారీ స్వాగతాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. ఇది రానున్న డిసెంబరులో ఆమె తిరిగి బంగ్లాదేశ్‌కు రావాలనే యత్నానికి ముఖ్యమైన సూచనగా నిలుస్తోంది. ఇక్కడ పెద్ద ప్రశ్న ఏంటంటే, హసీనా ప్రతిపాదించిన పునరాగమనం బంగ్లాదేశ్‌లో రాజకీయ పోటీని మళ్లీ తెరపైకి తీసుకువస్తుందా? లేక ఇప్పటికే ఉన్న వ్యవస్థలో విభేదాలను మరింత పెంచుతుందా? ఈ ప్రశ్నకు వచ్చే సమాధానమే అవామీ లీగ్ భవిష్యత్తు, బంగ్లాదేశ్ అంతర్గత రాజకీయాలు, భారతదేశంతో సంబంధాలను నిర్దేశించనుంది. హసీనా మూడు ప్రధాన డిమాండ్లు ముందుంచారు. అవామీ లీగ్‌పై నిషేధం ఎత్తివేయాలి, రాజకీయ ఖైదీలను విడుదల చేయాలి, మీడియా స్వేచ్ఛ, న్యాయవ్యవస్థ స్వతంత్రతను పునరుద్ధరించాలి. జులై ఉద్యమాన్ని అత్యంత ప్రణాళికాబద్ధంగా రూపొందించారని మహ్మద్ యూనస్ చేసిన వ్యాఖ్యను ఆమె ప్రస్తావించారు. 2024 ఉద్యమం వెనుక రాజకీయ కుట్రలు ఉన్నాయనే అంశానికి దీన్నే ఆధారంగా చూపించారు. న్యాయపరమైన దర్యాప్తులు అడ్డుపడుతున్నాయని, ప్రస్తుత రాజకీయ వ్యవస్థ చట్టబద్ధతపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. రెండు సంకేతాలు ఇందులో రెండు సంకేతాలు ఉన్నాయి. మొదటిది, “1971 స్ఫూర్తి” ప్రాధాన్యాన్ని, అవామీ లీగ్