హస్త కళాకారులకు తక్కువ ధరకే నాణ్యమైన కలప
Actor ProfilePolitician

హస్త కళాకారులకు తక్కువ ధరకే నాణ్యమైన కలప

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
హస్త కళాకారులకు తక్కువ ధరకే నాణ్యమైన కలప
Eenadu29 Nov 2026
హస్త కళాకారులకు తక్కువ ధరకే నాణ్యమైన కలప

అటవీ అధికారులతో సమీక్షలో ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఈనాడు, అమరావతి: హస్త కళాకారులకు అవసరమైన నాణ్యమైన కలపను తక్కువ ధరకే అందించేలా చర్యలు తీసుకోవాలని ఉపముఖ్యమంత్రి, అటవీ పర్యావరణశాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌ అధికారులకు సూచించారు. ‘లాభాపేక్ష లేకుండా కలప సేకరణ, రవాణా, నిర్వహణ ఖర్చులు మాత్రమే వసూలు చేసేలా ధర నిర్ణయించాలి. ముడి సరకు దొరక్క ఇబ్బంది పడుతున్న హస్త కళాకారులకు వుడ్‌ బ్యాంకులు వరం కావాలి. సాధ్యమైనంత వేగంగా అందుబాటులోకి తేవాలి’ అని నిర్దేశించారు. రాష్ట్రంలో ఆరు క్లస్టర్ల పరిధిలో క్రాఫ్ట్‌ వుడ్‌ బ్యాంకుల ఏర్పాటుపై సోమవారం ఆయన అధికారులతో సమీక్షించారు. అటవీ వనరుల సుస్థిర వినియోగం, శాస్త్రీయ నిర్వహణ, అక్రమ కలప సేకరణ నివారణ, కళాకారులకు ఉపయోగపడే ముఖ్యమైన కలప జాతుల పునరుత్పత్తి, తోటల అభివృద్ధి, సంప్రదాయ, వారసత్వ కళాకారులకు నిరంతర కలప సరఫరా తదితర లక్ష్యాల సాధనకు వుడ్‌ బ్యాంకులు ఉపయోగపడేలా చూడాలని పవన్‌ ఆదేశించారు. ‘దళారుల ప్రమేయం లేకుండా ప్రభుత్వమే చెక్కను అందివ్వడం వల్ల ఉత్పత్తి ఖర్చు తగ్గి, కళాకారులకు ఆర్థిక భరోసా లభిస్తుంది. భావితరాలు సంప్రదాయ కళల వైపు వస్తాయి. క్లస్టర్ల వారీగా కళాకారుల కలప అవసరాలు అంచనా వేయాలి. కలప లభ్యతను శాస్త్రీయంగా మ్యాపింగ్‌ చేయాలి. తక్కువగా దొరికే అంకుడు, తెల్లపొణికి చెట్లను అటవీశాఖ నర్సరీల్లో పెంచాల’ని పవన్‌ కల్యాణ్‌ సూచించారు. క్రాఫ్ట్‌ వుడ్‌ బ్యాంకుల డిజైన్, నిర్వహణలో ఒకే నమూనా పాటించాలని పీసీసీఎఫ్‌ పీవీ చలపతిరావుకు చెప్పారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి