
ఇంటర్నెట్‌డెస్క్: హర్మూజ్ (Hormuz) జలసంధిలో అమెరికా (USA) సైన్యం రహస్య షిప్పింగ్ కారిడార్‌ను నిర్వహిస్తోంది. దీని నుంచి గుట్టుగా నౌకలను జలసంధి దాటిస్తున్నట్లు అమెరికా పత్రిక సంచలన కథనం ప్రచురించింది. కాల్పుల విరమణ కొనసాగించేందుకు ట్రంప్ (Trump) నిరాకరించిన నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కొన్ని వారాల నుంచి అమెరికా దళాలు రాత్రి సమయంలో రహస్యంగా 15-20 వరకూ ట్యాంకర్లను సురక్షితంగా హర్మూజ్‌ను దాటిస్తున్నాయి. ఒమన్ తీరానికి సమీపంలోని దక్షిణ ఛానెల్ మార్గాన్ని దీనికి వినియోగిస్తున్నాయి. ఈ లెక్కన రోజుకు కనీసం కోటి బ్యారెళ్ల చమురు అందుబాటులోకి వస్తోంది. యుద్ధానికి ముందు సరఫరా అయ్యే చమురులో ఇది సగానికి సమానం. దీంతోపాటు ఖాళీ ట్యాంకర్లు తిరిగి గల్ఫ్ దేశాల్లో రేవులకు వెళ్లి చమురు నింపుకొని వచ్చేందుకు అమెరికా సైన్యం సాయం చేస్తోంది. ఈ మొత్తం ఆపరేషన్‌ను అమెరికాలోని నార్త్ కరోలినా ఫోర్ట్ బ్రాగ్‌లోని అమెరికా టాస్క్ ఫోర్స్ సమన్వయం చేస్తోంది. దీనికి గల్ఫ్‌దేశాల నుంచి సహకారం లభిస్తోంది. టాస్క్ ఫోర్స్ నిర్దేశిత సమయాల్లోనే ట్యాంకర్ల కాన్వాయ్‌లు కదులుతున్నాయి. ఇటీవల రెండు వారాలపాటు జరిపిన దాడుల్లో ఇరాన్ (Iran) మారిటైమ్ రాడార్, నిఘా వ్యవస్థలను అమెరికా దారుణంగా దెబ్బతీసింది. ఒమన్ వైపు సముద్రంపై నిఘా పెట్టే సామర్థ్యాన్ని దెబ్బతీసినట్లైంది. తాజాగా నౌకలపై డ్రోన్ దాడులను అడ్డుకొనేందుకు అమెరికా వాయుసేన ఫైటర్ జెట్స్ రక్షణగా వెళ్తున్నాయి. మేము అడగం.. మీరు చెప్పొద్దు: చిన్నారుల విషయంలో ఇన్‌స్టాగ్రామ్ వైఖరి మరోవైపు హర్మూజ్‌పై ఇరాన్ పట్టు 80% జారినట్లేనని అమెరికా మీడియాలో కథనాలు వెలువడ్డాయి. గత రెండు వారాలుగా ఒమన్ మార్గంలోనే 80శాతానికి పైగా నౌకలు హర్మూజ్‌ను దాటినట్లు షిప్ ట్రాకింగ్ సంస్థ కెప్లెర్ డేటా చెబుతోంది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి