హర్మూజ్ ను దాటి.. భారత్ వైపు 15 యూరియా
Actor ProfilePolitician

హర్మూజ్ ను దాటి.. భారత్ వైపు 15 యూరియా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
హర్మూజ్ ను దాటి.. భారత్ వైపు 15 యూరియా, డీఏపీ నౌకలు
Eenadu23 Sept 2026
హర్మూజ్ ను దాటి.. భారత్ వైపు 15 యూరియా, డీఏపీ నౌకలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికా-ఇరాన్‌ మధ్య శాంతి ఒప్పందం నేపథ్యంలో పశ్చిమాసియాలో పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో 15 నుంచి 20 ఎరువులు, ముడిసరకులతో కూడిన నౌకలు హర్మూజ్‌ జలసంధిని (Strait of Hormuz) సురక్షితంగా దాటి మనదేశం వైపు వస్తున్నట్లు కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖ వెల్లడించింది. వీటిలో ఎనిమిది నౌకలు 3.32 లక్షల టన్నుల యూరియా, నాలుగు నౌకల్లో 2.57 లక్షల టన్నుల డీఏపీ, మూడు నౌకల్లో 1.11 లక్షల టన్నుల సల్ఫర్‌ను భారత పోర్టులకు తీసుకువస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మరో ఐదు నౌకలు కూడా త్వరలో రానున్నాయని.. ఒక్కో దాంట్లో 0.25 లక్షల టన్నుల అమ్మోనియా, 0.45 లక్షల టన్నుల యూరియా ఉన్నట్లు చెప్పింది. హర్మూజ్‌లో సేవా రుసుం.. మిత్ర దేశాలకు స్పెషల్‌ ట్రీట్‌మెంట్‌: ఇరాన్‌ కొంత కాలంగా హర్మూజ్‌లో రవాణాకు అంతరాయం కలిగినప్పటికీ.. దేశంలో ఎరువుల లభ్యతకు ఆటంకం లేకుండా చూసుకున్నట్లు కేంద్రం తెలిపింది. ఒమన్, మలేసియా, వియత్నాం, జార్జియా, నైజీరియా, రష్యా, ఫిన్లాండ్, ఈజిప్ట్, అల్జీరియా, తుర్కియేతోపాటు నెదర్లాండ్స్ నుంచి యూరియా దిగుమతులు చేసుకుంటున్నట్లు తెలిపింది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. ముంబయి మెరైన్‌ డ్రైవ్‌ దగ్గర స్థానికుల సందడి కనిపించింది. భారీ వర్షానికి సముద్రపు అలలు అంతెత్తున ఎగసిపడుతుంటంతో.. మెరైన్‌ డ్రైవ్‌ వద్దకు చాలామంది ప్రజలు చేరుకున్నారు. గుజరాత్‌లోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్రలోని పుణె జిల్లాలో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా విస్తుపోయే ఘటన చోటుచేసుకుంది