
తమిళ సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘జననాయగన్’ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. సినిమా విడుదలకు సంబంధించి కీలకమైన సెన్సార్ ప్రక్రియ తాజాగా పూర్తయింది. తమిళ సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) నటించిన పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘జననాయగన్’ (Jana Nayagan) ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. సినిమా విడుదలకు సంబంధించి కీలకమైన సెన్సార్ ప్రక్రియ తాజాగా పూర్తయింది. ఈ సినిమా సెన్సార్ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి కష్టాలను ఫేస్ చేసిందో తెలియంది కాదు. చివరికి ఇందులోని హీరో విజయ్.. తమిళనాడు సీఎంగా అధికారం చేపట్టిన తర్వాత కూడా ఇప్పటి వరకు రిలీజ్‌పై సరైన క్లారిటీ రాకపోవడంతో.. ఫ్యాన్స్ అంతా నిరాశలో ఉన్నారు. ఇక ఇప్పుడు రీజనల్ సెన్సార్ బోర్డు బెంగళూరు కార్యాలయం ద్వారా ఈ చిత్రానికి క్లియరెన్స్ లభించింది. సినిమాలో ఉన్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సులు, పవర్‌ఫుల్ డైలాగుల నేపథ్యంలో సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ‘A’ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. ఈ చిత్ర రన్‌టైమ్ విషయానికి వస్తే.. సెన్సార్ బోర్డు ధృవీకరించిన వివరాల ప్రకారం సినిమా నిడివి 183.11 నిమిషాలు (సుమారు 3 గంటల 3 నిమిషాల 11 సెకన్లు) ఉంది. రన్‌టైమ్ 3 గంటలు బీట్ చేసినప్పటికీ, కథనంలో ఉన్న ఉత్కంఠ ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర బృందం నమ్మకంగా చెబుతోంది. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. తమిళనాడు ఎన్నికలకు ముందు విడుదల కావాల్సిన ఈ చిత్రం.. సెన్సార్, కోర్టులంటూ తిరిగి తిరిగి.. ఇప్పటికి విడుదలకు సిద్ధమైంది. అయితే మేకర్స్ ఇంకా విడుదల తేదీని మాత్రం ప్రకటించారు. సెన్సార్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి కావడంతో చిత్రయూనిట్ కూడా ఊపిరి పీల్చుకుంది. జూలై 9, 2026 నాటి అధికారిక సెన్సార్ సర్టిఫికేట్‌తో థియేట్రికల్