హమ్మయ్యా.. ఎట్టకేలకు ఆ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ వర్తింపు.. 22 ఏళ్ల తర్వాత నుంచి ప్రకటన
Actor ProfilePolitician

హమ్మయ్యా.. ఎట్టకేలకు ఆ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ వర్తింపు.. 22 ఏళ్ల తర్వాత నుంచి ప్రకటన

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
హమ్మయ్యా.. ఎట్టకేలకు ఆ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ వర్తింపు.. 22 ఏళ్ల తర్వాత నుంచి ప్రకటన
Samayam Telugu15 Oct 2026
హమ్మయ్యా.. ఎట్టకేలకు ఆ ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ వర్తింపు.. 22 ఏళ్ల తర్వాత నుంచి ప్రకటన

Old Pension Scheme : దేశవ్యాప్తంగా పాత పెన్షన్ స్కీమ్ (OPS) పునరుద్ధరించాలని ఉద్యోగాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కేటగిరీలోని ఉద్యోగులకు పెద్ద ఊరట కల్పించింది. ఉద్యోగంలో చేరిన రెండు దశాబ్దాల తర్వాత ఎట్టకేలకు వారికి పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకుంది. జనవరి 1, 2004న నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) అమలులోకి వచ్చినప్పటికీ అంత కంటే ముందే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుని ఆ తర్వాత ఉద్యోగంలో చేరిన నిర్దిష్ట ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ ఎంచుకునే వన్-టైమ్ ఆప్షన్ తీసుకువచ్చింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ తాజాగా ప్రసిద్ధ స్వయం ప్రతిపత్తి గల సంస్థ అయిన సీఎస్ఐఆర్ కూడా మెమోరండం జారీ చేసింది. అయితే, ఈ అదనపు ప్రయోజనం అందరు ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించదు. కేవలం ప్రత్యేక కేటగిరీకి చెందిన ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఇచ్చే కారుణ్య నియామక ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. అలాగే ఎవరైతే డిసెంబర్ 12, 2003 లేదా అంత కంటే ముందే కారుణ్య నియామకం కోసం దరఖాస్తు చేసుకుని, కొన్ని కారణాల వల్ల జనవరి 1, 2004 తర్వాత సర్వీసులో చేరాల్సి వచ్చిందో వారికి ఈ అవకాశం దక్కుతుంది. అలాగే గతంలో వీరికి నేషనల్ పెన్షన్ స్కీమ్ పరిధిలోనే పెన్షన్ ఇచ్చేవరాు. కానీ కేంద్రం పెన్షన్ శాఖ జూన్ 22, 2026 రోజున ఇచ్చిన లేఖ ఆధారంగా సీఎస్ఐఆర్ జులై 7, 2026న తమ ల్యాబ్, ఇన్‌స్టిట్యూట్లలోని కారుణ్య ఉద్యోగులకు సీసీఎస్ పెన్షన్ రూల్స్ 2021 లేదా ఓపీఎస్ ఎంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాధారణంగా ఉద్యోగంలో చేరిన తేదీ ఆధారంగా పెన్షన్ నిర్ణయిస్తారు. కానీ, ఈ ప్రత్యేక నిర్ణయం ప్రకారం ఉద్యోగంలో చేరిన డేట్‌తో సంబంధం లేకుండా, ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న