హింసను ప్రేరేపించేలా సీఎం రేవంత్ వ్యాఖ్యలు
Actor ProfilePolitician

హింసను ప్రేరేపించేలా సీఎం రేవంత్ వ్యాఖ్యలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
హింసను ప్రేరేపించేలా సీఎం రేవంత్ వ్యాఖ్యలు
Eenadu31 Oct 2026
హింసను ప్రేరేపించేలా సీఎం రేవంత్ వ్యాఖ్యలు

హైదరాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని మాజీ మంత్రి హరీశ్‌రావు(Harishrao) విమర్శించారు. హిట్లర్‌ తనకు ఆదర్శమని గతంలో రేవంత్‌ చెప్పారు.. అందుకే హిట్లర్‌ తరహాలో మాట్లాడుతున్నారన్నారు. చెప్పేందుకు విషయం లేకనే బూతులు మాట్లాడుతున్నారని.. నిన్నటి వ్యాఖ్యలపై సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. షాబాద్‌ ఘటనపై పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించినా.. తెలంగాణ సీఎం స్పందించలేదన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. ప్రాజెక్టులపై కనీస అవగాహన లేకుండా సీఎం మాట్లాడుతున్నారన్నారు. మేడిగడ్డ వద్ద నీళ్లు ఎత్తిపోయవచ్చని, విశ్రాంత ఇంజినీర్లు, నీటిపారుదలశాఖ అధికారులు చెబుతున్నా.. ఎందుకు ఎత్తిపోయట్లేదని ప్రశ్నించారు. సీఎంగా 31 నెలలు పూర్తయినా.. కాళేశ్వరంపై రేవంత్‌రెడ్డికి అవగాహన రాలేదన్నారు. రైతులకు నీళ్లిచ్చే ప్రయత్నం చేయకుండా.. ప్రతిపక్షాల గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని హరీశ్‌రావు విమర్శించారు. ‘‘వాస్తవాలు మాట్లాడిన వారిని జైలులో పెడతానంటూ భయపెడుతున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు మీద హైదరాబాద్‌ సహా అనేక జిల్లాలు ఆధారపడ్డాయి. రాజకీయాలకు పోయి..కరవు సమస్యను జఠిలం చేయొద్దు. నీళ్ల విషయంలో ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే ఊరుకునేది లేదు. కన్నెపల్లి పంప్‌హౌస్‌ కట్క నొక్కమంటే.. విపక్షాల కంఠం నొక్కుతున్నారు. మేడిగడ్డపై సీఎం రేవంత్‌రెడ్డి చెప్పేవన్నీ అవాస్తవాలే’’ అని హరీశ్‌రావు విమర్శించారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు