హాస్పిటల్లో చేరిన కేటీఆర్ కొడుకు హిమాన్షు.. మనవడి కోసం హుటాహుటిన హైదరాబాద్ కు కేసీఆర్.. ఇంతకూ ఏమయ్యింది
Actor ProfilePolitician

హాస్పిటల్లో చేరిన కేటీఆర్ కొడుకు హిమాన్షు.. మనవడి కోసం హుటాహుటిన హైదరాబాద్ కు కేసీఆర్.. ఇంతకూ ఏమయ్యింది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
హాస్పిటల్లో చేరిన కేటీఆర్ కొడుకు హిమాన్షు.. మనవడి కోసం హుటాహుటిన హైదరాబాద్ కు కేసీఆర్.. ఇంతకూ ఏమయ్యింది
Asianet News Telugu5 Oct 2026
హాస్పిటల్లో చేరిన కేటీఆర్ కొడుకు హిమాన్షు.. మనవడి కోసం హుటాహుటిన హైదరాబాద్ కు కేసీఆర్.. ఇంతకూ ఏమయ్యింది

Kalvakuntla Himanshu : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మనవడు, మాజీ మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు గాయపడ్డాయి. అమెరికాలో ఉన్నత చదువులు చదువుతున్న హిమాన్షు ఇటీవలే ఇండియాకు వచ్చిన విషయం తెలిసిందేే... కుటుంబసభ్యులు, స్నేహితులతో గడుపుతూ కొద్దిరోజులుగా హైదరాబాద్ లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఇవాళ (జూలై 7, మంగళవారం) ఉదయం జిమ్ లో వర్కౌట్స్ చేస్తుండగా అతడు గాయపడ్డాడు. హిమాన్షు ముక్కుకు గాయమై రక్తస్రావం కావడంతో వెంటనే కుటుంబసభ్యులు వెంటనే గచ్చిబౌలిలోకి ఏఐజి హాస్పిటల్ కు తరలించారు. ఇప్పటికే కేటీఆర్ దంపతులు హాస్పిటల్లోనే ఉన్నారు... కొడుకు పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు డాక్టర్లతో సంప్రదిస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు కూడా హాస్పిటల్ కు చేరుకుని హిమాన్షు ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. మరికొద్దిసేపట్లో మాజీ సీఎం కేసీఆర్ కూడా హాస్పిటల్ కు చేరుకుని మనవడిని పరామర్శించనున్నారు… ఇందుకోసం ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుండి బయలుదేరినట్లు తెలుస్తోంది. హిమాన్షు ఆరోగ్య పరిస్థితిపై బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే బిఆర్ఎస్ కీలక నాయకులంతా గచ్చిబౌలి ఏఐజి హాస్పిటల్ కు చేరుకుంటున్నారు. అయితే ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని... హిమాన్షుకు గాయం చిన్నదేనని డాక్టర్లు చెబుతున్నట్లు సమాచారం. అయితే అధికారికంగా కేటీఆర్ తనయుడి హెల్త్ కండీషన్ గురించి తెలియాల్సి ఉంది