
యంగ్ హీరోహీరోయిన్లు అన్షు, వాసవి గణేషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘హుషారు పిట్టలు’. ఈ సినిమాకు బిక్షు దర్శకత్వం వహిస్తున్నారు. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వెంకట్ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రతిష్టాత్మక నిర్మాణ , పంపిణీ సంస్థలైన ఏషియన్, సురేష్ ఫిలింస్ ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తుండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదివరకు విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశాయి. కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఇప్పుడు అడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ చిత్రం రాబోయే ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. రిలీజ్ తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్ల వేగాన్ని గణనీయంగా పెంచింది. ఇందులో భాగంగానే తాజాగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునేలా ఈ సినిమా అధికారిక ట్రైలర్‌ను విడుదల చేశారు. ఎక్కువ మంది చదివినవి : Jason Sanjay: ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే.. దూరమయ్యాకే విలువ తెలిసింది.. విజయ్ దళపతి కొడుకు జాసన్ సంజయ్.. విడుదలైన ట్రైలర్ ఆద్యంతం వినోదాత్మకంగా, ఆసక్తికరంగా సాగుతూ సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. యువతను మెప్పించే లవ్, కామెడీ, ఎమోషనల్ అంశాలతో దర్శకుడు బిక్షు ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. ముఖ్యంగా ప్రధాన జోడీ అన్షు , వాసవి గణేషన్ మధ్య కెమిస్ట్రీ, నటన, అలాగే సంభాషణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంభాషణలు చాలా సజీవంగా, యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయని ట్రైలర్ చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎక్కువ మంది చదివినవి : Cinema : ఓటీటీలో దుమ్మురేపుతున్న సస్పెన్స్ థ్రిల్లర్.. 3 ఏళ్లుగా ట్రెండ్ అవుతున్న క్రైమ్ సిరీస్.. ఈ చిత్రానికి అందించిన సంగీతం, నేపథ్య సంగీతం సినిమా మూడ్‌కి తగినట్లుగా ఉండి, సన్నివేశాల