హెల్తీ.. వెల్తీ.. హ్యాపీ ఏపీ.. 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర విజన్.. 2047 నాటికి నంబర్ వన్ లక్ష్యం
Actor ProfilePolitician

హెల్తీ.. వెల్తీ.. హ్యాపీ ఏపీ.. 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర విజన్.. 2047 నాటికి నంబర్ వన్ లక్ష్యం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
హెల్తీ.. వెల్తీ.. హ్యాపీ ఏపీ.. 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర విజన్.. 2047 నాటికి నంబర్ వన్ లక్ష్యం
NTV Telugu23 Dec 2026
హెల్తీ.. వెల్తీ.. హ్యాపీ ఏపీ.. 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర విజన్.. 2047 నాటికి నంబర్ వన్ లక్ష్యం

CM Chandrababu: రాజధాని అమరావతిలోని రాయపూడి పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. భారతీయులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఆయన హృదయపూర్వక స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ జెండా స్వాతంత్ర్యానికి ప్రతీక మాత్రమే కాకుండా ఆత్మగౌరవానికి ప్రతిబింబం, ఐక్యతకు చిహ్నం, భవిష్యత్‌కు మార్గదర్శకమని పేర్కొన్నారు. 90 ఏళ్ల పోరాట ఫలమే స్వాతంత్ర్యం స్వాతంత్ర్యం ఒక్కరోజులో, ఒక్కరి పోరాటంతో రాలేదని చంద్రబాబు అన్నారు. ఎన్నో దశాబ్దాల పోరాటం, తరాల ఉద్యమం, మహనీయుల బలిదానాలు, అమరవీరుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. మహాత్మా గాంధీ అహింసను ఆయుధంగా మార్చారని, సుభాష్ చంద్రబోస్ ధైర్యాన్ని దేశభక్తికి ప్రతీకగా నిలిపారని గుర్తుచేశారు. భగత్ సింగ్ త్యాగం యువతలో విప్లవ స్ఫూర్తిని రగిలించిందన్నారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ దేశాన్ని ఐక్యం చేయగా, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దేశానికి రాజ్యాంగాన్ని అందించారని సీఎం పేర్కొన్నారు. తెలుగు నేల కూడా స్వాతంత్ర్య సమరంలో తనదైన ముద్ర వేసిందన్నారు. అల్లూరి సీతారామరాజు పోరాటం, పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా తెలుగు ప్రజలకు గర్వకారణమని అన్నారు. 2047 నాటికి దేశం, రాష్ట్రాన్ని నంబర్ వన్ చేయాలి 80 ఏళ్ల క్రితం మన పెద్దలు స్వేచ్ఛా భారతదేశం కోసం కలలు కన్నారని, పోరాడి ఆ స్వేచ్ఛను మనకు అందించారని చంద్రబాబు అన్నారు. ఇప్పుడు దేశ నిర్మాణం కోసం పనిచేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. 2047 నాటికి దేశాన్ని, రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా నిలపాలనే సంకల్పంతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దేశం మనకు హక్కులు, గుర్తింపు, గౌరవం ఇచ్చిందని, ఇప్పుడు దేశానికి మనం ఏం ఇవ్వగలమనే ఆలోచన చేయాల్సిన సమయం వచ్చిందని సీఎం అన్నారు. ‘నా దేశం-నా బాధ్యత’ అనే భావనతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. చేతిలో జాతీయ జెండాతో పాటు గుండెల్లో బలమైన అజెండా ఉండాలని అన్నారు