హీరో సింప్లిసిటీ... మార్కెట్లో కూరగాయలు అమ్మిన కోలీవుడ్ నటుడు
Actor ProfileActor

హీరో సింప్లిసిటీ... మార్కెట్లో కూరగాయలు అమ్మిన కోలీవుడ్ నటుడు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
హీరో సింప్లిసిటీ... మార్కెట్లో కూరగాయలు అమ్మిన కోలీవుడ్ నటుడు, నెట్టింట వీడియో వైరల్
Samayam Telugu24 Jan 2027
హీరో సింప్లిసిటీ... మార్కెట్లో కూరగాయలు అమ్మిన కోలీవుడ్ నటుడు, నెట్టింట వీడియో వైరల్

సినిమా తారలు వెండితెరపై ఎంతటి గ్లామరస్ పాత్రలు పోషించినా, నిజజీవితంలో వారు వ్యవహరించే తీరు ఒక్కోసారి అందరినీ ఆశ్చర్యపరుస్తుంటుంది. రంగుల ప్రపంచానికి, ప్రచార ఆర్భాటాలకు దూరంగా సాధారణ ప్రజలతో మమేకమైనప్పుడు వారిలోని అసలైన వ్యక్తిత్వం బయటపడుతుంది. కోలీవుడ్ హీరో విమల్ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. తాజాగా తన సొంతూరిలో ఆయన చేసిన ఓ చిన్న పని ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అయింది. ఓ సినీ హీరో ఏమాత్రం భేషజాలు లేకుండా స్థానిక సంతలో కూరగాయల వ్యాపారిగా మారిపోవడం అందరి దృష్టినీ ఆకర్షించింది.ఈ ఆసక్తికర సంఘటన వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లా మనప్పరై సమీపంలో ఉన్న తన స్వస్థలానికి విమల్ ఓ సినిమా షూటింగ్ కోసం వెళ్లారు. ఆ సమయంలో పన్నన్‌కొంబు ప్రాంతంలో వారపు సంతను ఆయన సందర్శించారు. కేవలం అతిథిలా వచ్చి చూసి వెళ్లిపోకుండా, నేరుగా అక్కడి చిరువ్యాపారుల పక్కనే కూర్చుండిపోయారు. కూరగాయలు కొనుగోలు చేయడానికి వచ్చిన వినియోగదారులను ఆప్యాయంగా పలకరిస్తూ, తానే స్వయంగా కూరగాయలు తూకం వేసి అమ్మడం ప్రారంభించారు. తమ అభిమాన నటుడు స్వయంగా మార్కెట్‌లో వ్యాపారం చేస్తుండటం చూసిన స్థానికులు, కొనుగోలుదారులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురై ఆయన వద్దకు గుమిగూడారు.* రవితేజ ‘ఇరుముడి’ ట్విట్టర్ రివ్యూ... మాస్ మహరాజా ఈసారి గట్టిగా కొట్టాడా?మార్కెట్‌లోని సాధారణ రైతులతో, వ్యాపారులతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ... వారికి అమ్మకాల్లో విమల్ చేదోడువాదోడుగా నిలిచారు. అక్కడితో ఆగకుండా, కొంతసేపు వారి వద్ద గడిపిన అనంతరం చుట్టుపక్కల ఉన్న కొందరు చిరు వ్యాపారులకు ఒక్కొక్కరికి రూ. 500 చొప్పున ఆర్థిక సాయం అందజేసి తన ఉదారతను చాటుకున్నారు. ఎంత ఎదిగినా తన మూలాలను, సొంత ఊరి ప్రజలను మర్చిపోకుండా ఆయన ప్రదర్శించిన నిరాడంబర వైఖరి అందరి హృదయాలను గెలుచుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో నెటిజన్లు ఆయన సింప్లిసిటీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.చెక్ బౌన్స్ కేసులో జైలు శిక్షఅయితే