
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు నటుడిగా అంటే హీరోగా మారబోతున్నారు… ఈ వార్త తెలుగు సినిమా వర్గాలనే కాదు ప్రేక్షకులనూ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వర్మ ఏంటీ, హీరో ఏంటి? అని అనుకుంటున్నారు… కానీ ఇదే నిజం. తనదైన ప్రత్యేక శైలిలో సినిమాలు తీసే వర్మ, కెమెరా ముందుకొచ్చి పూర్తిస్థాయి హీరోగా నటించడం అనూహ్య పరిణామం. ఈ సినిమా ద్వారా కథానాయకుడి పాత్ర గురించి తనకున్న ఆలోచనలను తెరపైకి తీసుకురాబోతున్నారు రామ్ గోపాల్ వర్మ. గతంలో అతిథి పాత్రల్లో కనిపించిన వర్మ ఇప్పుడు హీరోగా ఒక పూర్తి నిడివి చిత్రంలో కనిపించనున్నారు. ఇది కేవలం ఒక దర్శకుడు నటుడిగా మారడం మాత్రమే కాదు… సినిమాపై ఆయనకున్న అవగాహనను, హీరోయిజంపై అభిప్రాయాలను వ్యక్తం చేసే ప్రయోగం కాబోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నిర్ణయం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కొత్త చర్చకు దారితీసింది. తెలుగు సినిమాలో హీరో అంటే ఒక కండల వీరుడు, శత్రువులను అలవోకగా చిత్తు చేసేవాడు, అద్భుతమైన ఫైట్లు చేసేవాడు అనే ఇమేజ్ ఉంది. వర్మ తన కొత్త సినిమా ద్వారా ఈ సాంప్రదాయ నమ్మకాలను ప్రశ్నిస్తున్నారు. అతను బలమైన బాడీతో కాకుండా తన తెలివితేటలు, సంభాషణలు, ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో హీరోగా నిరూపించుకోబోతున్నారు. రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ మూస ధోరణులను విమర్శిస్తుంటారు... ఆయన హీరోగా మారడం ఈ విమర్శకు ఒక ఆచరణాత్మక రూపం. కేవలం శారీరక బలం మాత్రమే కాదు మానసిక ధైర్యం, మేథస్సు కూడా ఒక హీరోకు ప్రధాన లక్షణాలని ఆయన చూపించనున్నారు. ఈ కొత్త కోణం ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. రామ్ గోపాల్ వర్మ తన కెరీర్ ఆరంభం నుంచీ వినూత్న చిత్రాలకు, అసాధారణ ఆలోచనలకు పెట్టింది పేరు. శివ, రంగీలా వంటి చిత్రాలతో కొత్త ట్రెండ్‌లు సృష్టించిన వర్మ, తన సినిమా నిర్మాణంలో ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటారు. ఇప్పుడు హీరోగా మారడం ఆయన ప్రయోగాత్మక ధోరణికి మరో