హ్యుందాయ్ మోబిస్ విస్తరణకు ఏపీ సంపూర్ణ మద్దతు
Actor ProfilePolitician

హ్యుందాయ్ మోబిస్ విస్తరణకు ఏపీ సంపూర్ణ మద్దతు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
హ్యుందాయ్ మోబిస్ విస్తరణకు ఏపీ సంపూర్ణ మద్దతు
Eenadu2 Oct 2026
హ్యుందాయ్ మోబిస్ విస్తరణకు ఏపీ సంపూర్ణ మద్దతు

సియోల్: దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా 3వ రోజు వివిధ సంస్థల ప్రతినిధులతో ఏపీ మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) భేటీ అయ్యారు. దక్షిణ కొరియాకు చెందిన ఆటోమోటివ్ మాడ్యూల్స్, కాంపొనెంట్స్, ఎలక్ట్రిఫికేషన్ పరికరాల తయారీ సంస్థ హ్యుందాయ్ మోబిస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ యంగ్ బిన్ కిమ్, వైస్ ప్రెసిడెంట్ హన్సోక్ పార్క్, జంగ్‌హో సియోలతో ఆయన సియోల్‌లో సమావేశమై చర్చించారు. ఏఐ, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్‌లో ఈవీ సెమీ కండక్టర్స్ హబ్ ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రి లోకేశ్‌ విజ్ఞప్తి చేశారు. తిరుపతి, అనంతపురం సమీపంలో ఈవీ కాంపోనెంట్స్ & బ్యాటరీ సిస్టమ్స్ తయారీ కేంద్రం, విశాఖపట్నంలో హ్యుందాయ్ మోబిస్ ఆర్&డీ/ఇంజనీరింగ్ విభాగాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. ఐఐటీ తిరుపతి భాగస్వామ్యంతో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ప్రతిపాదించారు. అనంతపురాన్ని ఆటోమొబైల్ హబ్‌గా మార్చడానికి, టైర్-1 సరఫరాదారుల సమావేశం నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్‌తో భాగస్వామ్యం వహించాలని కోరారు. భారతదేశంలో హ్యుందాయ్ మోబిస్ విస్తరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపూర్ణ మద్దతునిస్తుందని చెప్పారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సంస్థ ఉన్నతస్థాయి బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హ్యుందాయ్ మోబిస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ యంగ్ బిన్ కిమ్ అన్నారు. సెమీ కండక్టర్స్, OSAT (అసెంబ్లింగ్, ప్యాకేజింగ్, టెస్టింగ్) రంగంలో పేరెన్నికగన్న ‘అపాక్ట్’ (APACT) కంపెనీ సీఈవో సియాంగ్ డాంగ్ లీతో మంత్రి లోకేశ్‌ సియోల్ లో సమావేశమయ్యారు. ASIP భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్‌లో అపాక్ట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినందుకు మంత్రి లోకేశ్‌ ధన్యవాదాలు తెలిపారు. అపాక్ట్‌తో దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని ఆశిస్తున్నట్లు చెప్పారు. భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు పరిశీలిస్తున్న ‘హనా మైక్రాన్’ (Hana Micron)తో పాటు ఇతర OSAT సంస్థలు ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా అనుసంధానించాలని APACTని కోరారు. OSAT సెమీకండక్టర్ కార్యకలాపాలకు సంబంధించి యువతలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడం కోసం APSSDCతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలని మంత్రి లోకేశ్‌ ప్రతిపాదించారు. భారతదేశంలో అపాక్ట్