హామీలు విస్మరిస్తే ప్రజాగ్రహం తప్పదు
Actor ProfilePolitician

హామీలు విస్మరిస్తే ప్రజాగ్రహం తప్పదు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
హామీలు విస్మరిస్తే ప్రజాగ్రహం తప్పదు
Namasthe Telangana4 Dec 2026
హామీలు విస్మరిస్తే ప్రజాగ్రహం తప్పదు

జూలూరుపాడులో ప్రజా చైతన్య యాత్రకు నీరాజనాలు జూలూరుపాడు, ఆగస్టు 11 : ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి పాలన సాగిస్తే పాలకులకు ప్రజల నుండి తిరుగుబాటు తప్పదని, ప్రజాస్వామ్య పరిరక్షణకు దేశంలో తీవ్రమైన మార్పు రావాల్సిన అవసరం ఉందని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సీపీఐ చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర మంగళవారం జూలూరుపాడు మండల కేంద్రానికి చేరుకోగా, పార్టీ శ్రేణులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సాగిన ఈ యాత్రలో భాగంగా ప్రధాన రహదారిపై పార్టీ శ్రేణులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కూనంనేని మాట్లాడుతూ.. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తూ నియంతృత్వ పోకడలతో పాలన సాగిస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల కల్పన, ఖాతాల్లో రూ.15 లక్షల జమ వంటి హామీలను గాలికి వదిలేసి, మత విద్వేషాలను రెచ్చగొడుతూ కాలక్షేపం చేస్తోందని ఆరోపించారు. ఇటీవల వెలుగుచూసిన నీట్ కుంభకోణంతో లక్షలాది మంది విద్యార్థులు, యువత భవిష్యత్‌ను చీకట్లోకి నెట్టారని విమర్శించారు. దీనికి నిరసనగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా యువత సాగించిన పోరాటం కేంద్ర ప్రభుత్వానికి చెంపపెట్టుగా మారిందన్నారు. దేశ సంపదను కొద్దిమంది కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్న తీరును ఎండగడుతూ, సామాజిక-రాజకీయ మార్పు కోసం సీపీఐ ముందుండి పోరాడుతుందని స్పష్టం చేశారు. అదేవిధంగా రాష్ట్రంలోనూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలోనూ, హామీల అమలులోనూ అలసత్వం వహిస్తే ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కే. షాబీర్ పాషా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, కల్లూరి వెంకటేశ్వర్లు, పుల్లారెడ్డి, కొత్తగూడెం మేయర్ మూడూ గణేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు చండ్ర నరేంద్ర కుమార్, నరాటి ప్రసాద్, చంద్రగిరి శ్రీనివాస్, కంచర్ల జమలయ్య, భూక్యా శ్రీనివాస్, ఎస్.కే. ఫయాజ్, వరక