
హిమాచల్ ప్రదేశ్‌లో వాహనదారులపై ప్రభుత్వం కొత్త భారం మోపింది. రాష్ట్రంలో విక్రయించే ప్రతి లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 60 పైసల చొప్పున 'వితంతు, అనాథల సెస్' (Widow and Orphan Cess) విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచే ఈ కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. ఇది ముడి చమురు ధరల పెరుగుదల వల్ల కాకుండా, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా విధించిన సెస్ కావడం గమనార్హం. రాష్ట్ర పన్నులు, ఎక్సైజ్ శాఖ ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతానికి 60 పైసలు విధిస్తున్నప్పటికీ, చట్టప్రకారం లీటర్‌కు రూ.5 వరకు వసూలు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. దీంతో భవిష్యత్తులో ఈ భారం మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.సెస్ విధింపు వెనుక కారణం ఏంటి?ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు నేతృత్వంలోని ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలోనే ఈ సెస్ కోసం అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో ఇప్పటికే వితంతువులు, అనాథల కోసం పలు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. అయితే, బడ్జెట్ కేటాయింపులతో సంబంధం లేకుండా ఈ పథకాలకు నిరంతరాయంగా నిధులు సమకూర్చాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రతిపక్షాల నిరసనల మధ్య ఈ బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది.అయితే, ఎవరి సంక్షేమం కోసమైతే ఈ సెస్ విధిస్తున్నారో, అదే వితంతువులు, అనాథ కుటుంబాలు సహా సామాన్యులందరిపైనా ఈ భారం పడుతుండటం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అన్యాయమని పెట్రోలియం డీలర్ల సంఘం పేర్కొంది. ధరల