
CURE Bill : తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మహానగర పాలనలో మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో 70ఏళ్ల జీహెచ్ఎంసీ చట్టానికి స్వస్తి చెప్పబోతోంది. మూడు కార్పొరేషన్లు (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ) కలిపి కొత్త చట్టాన్ని తీసుకువస్తోంది. ఈ మేరకు క్యూర్ ముసాయిదా బిల్లు (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) -2026ను ఆదివారం విడుదల చేసింది. ఈ బిల్లులో 43 చాప్టర్లు, తొమ్మిది షెడ్యూళ్లు ఉన్నాయి. జూలై 24 వ తేదీ వరకు ప్రజాభిప్రాయాలు, సూచనలు స్వీకరించనున్నట్లు మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి (ఎంఏయూడీ) శాఖ ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) 2026 ముసాయిదా బిల్లు అమల్లోకి వస్తే హైదరాబాద్ పరిధిలోని ఆస్తి యాజమానులపై పన్నుభారం పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న వార్షిక అద్దె విలువ విధానానికి బదులుగా, ఆస్తి మూలధన విలువ ఆధారంగా ప్రాపర్టీ ట్యాక్స్ ను నిర్ణయించే విధానాన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది. అంతేకాక.. రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వం నిర్ణయించే మార్కెట్ విలువను ఆధారంగా తీసుకొని స్థలాలు, భవనాలపై ఆస్తిపన్ను విధించనున్నారు. దీంతో ముఖ్యంగా పాత జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అనేక ఆస్తులపై పన్ను గణనీయంగా పెరిగే అవకాశాలు ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఉన్న భవనాలకు పన్ను పెంపును దశలవారీగా అమలు చేసే అవకాశం ఉంది. కొత్తగా నిర్మించే భవనాలకు కొత్త విధానం వెంటనే అమల్లోకి వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం తెలుస్తోంది. క్యూర్ ముసాయిదా బిల్లు అమల్లోకి వస్తే.. క్యూర్ పరిధిలో అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు కఠిన చర్యలు చేపడతారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినా.. అందులో ఎవరైనా నివాసం ఉండే పరిస్థితి ఉన్నా.. కమిషనర్లు 24 గంటల ముందు నోటీసులు ఇచ్చి సీజ్ చేయొచ్చు. ఒకవేళ ప్రజల భద్రతకు ఇబ్బందిగా ఉంటే ఎలాంటి నోలీసులు ఇవ్వకుండానే సీజ్ చేసే అవకాశం