హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయంలో చోరీ
Actor ProfilePolitician

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయంలో చోరీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయంలో చోరీ
Andhra Jyothy22 Nov 2026
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయంలో చోరీ

బోనాల పర్వదినం వేళ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ పెద్దమ్మతల్లి ఆలయంలో దొంగతనం కలకలం రేపుతోంది. ఆలయానికి వచ్చిన ఓ భక్తురాలి బ్యాగ్‌ను దుండగుడు చోరీ చేశాడు. హైదరాబాద్‌: బోనాల పర్వదినం వేళ జూబ్లీహిల్స్‌ పెద్దమ్మతల్లి ఆలయంలో దొంగతనం కలకలం రేపుతోంది. ఆలయానికి వచ్చిన ఓ భక్తురాలి బ్యాగ్‌ను దుండగుడు చోరీ చేశాడు. బాధిత మహిళ పూజలు చేస్తున్న సమయంలో ఆమె బ్యాగ్‌ను చాకచక్యంగా కత్తిరించాడు. ఆపై అందులోని పౌచ్‌ను అపహరించి అక్కడి నుంచి ఉడాయించాడు. పౌచ్‌లో ఐదు వెండి బిస్కెట్లు, రూ.5 వేలు ఉన్నట్లు బాధితురాలు వాపోయింది. బోనాల సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉండటాన్ని ఆసరాగా చేసుకున్న దుండగుడు చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా, ఘటనపై జూబ్లీహిల్స్‌ పోలీసులను బాధిత భక్తురాలు ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆలయంలోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తున్నారు. వాటి ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బోనాల సందర్భంగా పెద్దమ్మగుడికి భారీగా భక్తులు వస్తున్నా.. భద్రతా చర్యలు తగినంతగా లేకపోవడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయం సహా పరిసర ప్రాంతాల్లో నిఘా పెంచాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలను నిరంతరం పర్యవేక్షించాలని కోరుతున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి రూ.2.25 కోట్ల చెక్కు అందజేసిన కేసీఆర్ కుమురం భీమ్ ఆశయాల సాధనకు అందరూ ఐక్యంగా కృషి చేయాలి: మంత్రి సీతక్క