
ఫీడర్ల మరమ్మతుల కారణంగా గ్రీన్‌ల్యాండ్స్ ఏడీఈ పరిధిలో శుక్రవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని ఏడీఈ వంశీకృష్ణ తెలిపారు. హైదరాబాద్: ఫీడర్‌ల మరమ్మతుల కారణంగా గ్రీన్‌ల్యాండ్స్ ఏడీఈ పరిధిలో శుక్రవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని ఏడీఈ వంశీకృష్ణ తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు హోటల్ గ్రీన్ పార్క్, దివ్యశక్తి ఆపార్ట్‌మెంట్ ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లో, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శ్రీనివాసకాలనీ ఈస్ట్, హైదరాబాద్ సెంట్రల్ ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని ఏడీఈ పేర్కొన్నారు. బంజారాహిల్స్ ఏడీఈ పరిధిలో.. శుక్రవారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జూబీహిల్స్ హెచ్‌పీ గ్యాస్ కార్యాలయం, సీఓడీ ఫడర్ల పరిధిలోని ప్రాంతాల్లో, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 58, హైటెక్ థియేటర్ ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని ఏడీఈ జి. గోపి తెలిపారు. కడియంకు దమ్ముంటే మంత్రి పదవి తెచ్చుకోవాలి
